మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు వోక్స్‌వ్యాగన్ పోలో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లకు పోటీగా బాలెనో ను విడుదల చేసింది. ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కాస్త ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ పోటీదారులకు చెమటలు పుట్టిస్తోంది బాలెనో.
విపణిలోకి విడుదలైన నాటి నుండి సరిగ్గా 20 నెలల్లో రెండు లక్షల యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడుపోయాయి. ఈ సెగ్మెంట్లో ఉన్న ప్రతి మోడల్‌కు సవాల్ చేసే విధంగా నెలకు సగటున 10,000 యూనిట్ల వరకు అమ్ముడుపోతున్నాయి.
విభిన్నమైన మరియు అన్ని వయస్కుల వారికి మ్యాచ్ అయ్యే ఫ్రంట్ డిజైన్, విశాలమైన క్యాబిన్ స్పేస్, అధ్బుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ మరియు సేఫ్టీ ఫీచర్లతో ఈ మేడిన్ ఇండియా బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌కు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లో స్టాండర్డ్ ఫీచర్లుగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అదే విధంగా ఆపిల్ కార్‌ప్లే వంటి వాటిని మారుతి సుజుకి అందించింది.
కస్టమర్లకు ధన్యవాదాలు చెబుతూ, మారుతి సుజుకి ఎక్సిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగాధిపతి ఆర్ఎస్ కల్సి గారు మాట్లాడుతూ, 'దేశీయ మరియు ప్రపంచ విపణిలోని కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అభివృద్ది చేశామని తెలిపాడు. ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోనే కాకుండా ఇతర సెగ్మెంట్లోని కార్లను గట్టి పోటీగా నిలిచిందని తెలిపాడు.'
అంతే కాకుండా, 'డిజైన్ మరియు ఇందులో అందించిన టెక్నాలజీ పరంగా ప్రపంచ మార్కెట్ చేత బాలెనో స్వాగతించబడింది. బాలెనో సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ డెలివరీ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న కస్టమర్లకు ధన్యావాదాలు చెప్పుకొచ్చారు.'
కేవలం ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోనే కాకుండా హై-పర్ఫామెన్స్ సెగ్మెంట్లోకి కూడా బాలెనో అర్ఎస్ పేరుతో ఎంటర్ అయ్యింది. అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేసే విధంగా బాలెనో ఆర్ఎస్‌లో స్పోర్టివ్ వెర్షన్ ఫీల్ కలిగించేందుకు బూస్టర్ జెట్ ఇంజన్ అందివ్వడం జరిగింది.
ఫర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో వోక్స్‌వ్యాగన్ వారి పోలో మాత్రమే ఉంది. దీనికి పోటీగా వచ్చిన బాలెనో ఆర్ఎస్ మంచి ఫలితాలనిస్తోంది. ఇందులోని 1.0-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 101బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి బాలెనో కారును ప్రస్తుతం 100 దేశాల వరకు ఎగుమతి చేస్తోంది. మరియు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా మిషన్‌లో భాగంగా జపాన్‍కు ఎగుమతి తొలి కారు కూడా ఇదే.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు యూరప్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు లాటిన్ అమెరికా దేశాలకు బాలెనో ప్రధానంగా ఎగుమతి చేయబడుతోంది. సెగ్మెంట్ లీడింగ్ ఫీచర్ల జోడింపుతో ఉన్న బాలెనో ధరలను అత్యంత చాకచక్యంగా నిర్ణయించింది. దీంతో బాలెనోను ఎదుర్కోవడం పోటీదారులకు కాస్త కష్టమే.

No comments: