చైనా లోని గాంగ్జీ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉండే క్యాంటీన్ అది. అదే యూనివర్సిటీలో చదివే ఓ విద్యార్థిని నూడుల్స్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ రాగానే నూడుల్స్ ను కుమ్మేద్దామనుకుంది. నూడుల్స్ ను తీసుకొచ్చాడు వెయిటర్. ఇక లాగించేయడానికి సిద్ధమైంది. రెండు మూడు బైట్స్ తిన్నది కూడా. తర్వాత స్పూన్ తో నూడుల్స్ ను అటూ ఇటూ అంటుంటే టక్కున ఓ పాము పిల్ల ప్రత్యక్షమైంది నూడుల్స్ లో.
దెబ్బకు బేర్ మన్న ఆ అమ్మాయి విషయాన్ని క్యాంటిన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదట. వెంటనే నూడుల్స్ లో ఉన్న పాము పిల్ల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక.. చైనా లో తెగ
వైరలయ్యాయి ఆ ఫోటోలు. దీంతో క్యాంపస్ లో ఉన్న క్యాంటీన్ పై రైడ్ చేశారు అధికారులు. క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటంతో వెంటనే దాన్ని సీజ్ చేశారు అధికారులు.

No comments: