నటి 'అంజలి' సూసైడ్.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నటి 'అంజలి' సూసైడ్..

వెండితెరపై నటిస్తున్న పలువురు హీరో..హీరోయిన్లు ఇతరత్రా కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తుంటాం. అంతేగాకుండా నటీనటులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతున్నాయి. తాజాగా బోజ్ పురి నటి 'అంజలి శ్రీవాత్సవ' (29) కూడా చేరింది. ముంబైలోని జుహు రోడ్ లోని పరిమల్ సొసైటీలో ఉన్న తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఇతర తాళంతో డోర్ ను ఓపెన్ చేయగా 'అంజలి' విగతజీవిగా కనిపించినట్లు సమాచారం. దీనితో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదు. ఆమె 'కెహు తా దిల్ మే బా' చిత్రంలో నటించారు. గతంలో 'గోపాల్ రాయ్, ఆదిత్య కశ్యప్, రాజా, ప్రేమ్ దూబే' వంటి చిత్రాల్లో 'అంజలి' ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో రానున్న రోజుల్లో తెలియనున్నాయి.
నటి 'అంజలి' సూసైడ్.. Reviewed by CHANDRA BABU on June 21, 2017 Rating: 5 వెండితెరపై నటిస్తున్న పలువురు హీరో..హీరోయిన్లు ఇతరత్రా కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తుంటాం. అంతేగాకుండా నటీనటులు అనుమానాస్...

No comments: