టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగొందిన 'సిమ్రాన్' మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో విలన్ గా నటిస్తోందని తెలుస్తోంది. శివ కార్తికేయన్, పొన్ రామ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తీకేయన్..సమంత తొలిసారిగా నటిస్తున్నారు. వీరితో పాటు 'సిమ్రాన్'..'నెపోలియన్' కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో 'శివ కార్తికేయన్' తండ్రి పాత్రలో 'నెపోలియన్' నటిస్తున్నట్లు..ప్రతి నాయకిగా 'సిమ్రాన్' నటిస్తోందని తెలుస్తోంది. అంబ సముద్రంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. శివ కార్తికేయన్‌తో 'రెమో', 'వేలైక్కారన్' చిత్రాన్ని నిర్మించిన 24 ఎ.ఎం. స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది.
సమంత ఫిల్మ్ లో 'సిమ్రాన్' విలన్ ?
Reviewed by CHANDRA BABU
on
June 21, 2017
Rating: 5
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగొందిన 'సిమ్రాన్' మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు విజయవంతమైన సినిమాల...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: