రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ 2.0. భారతీయ చిత్రాల్లోనే దాదాపు 350 కోట్లకు మించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. బ్రిటీష్ నటి అమీజాక్సన్ కథానాయికగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ సైంటిస్ట్‌గా, రోబోగా కనిపించనున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమీజాక్సన్ కూడా రోబోగా కనిపించనుందని సమాచారం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్‌ను పూర్తి చేసిన రెహమాన్ త్వరలో రీరికార్డింగ్‌కు సంబంధించిన వర్క్‌ను మొదలుపెట్టనున్నాడట. కాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను అత్యంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. అక్టోబర్ నెలలో దుబాయ్‌లో జరగనున్న ఈ వేడుక కోసం దాదాపు 25 కోట్లు ఖర్చు చేయనున్నారని సమాచారం. శంకర్ గతంలో ఐ సినిమా ఆడియో వేడుకను భారీగా నిర్వహించి ఆ కార్యక్రమానికి హాలీవుడ్ హీరో అర్నాల్డ్ స్కార్జ్‌నెగ్గర్‌ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో 2.0 ఆడియో కార్యక్రమానికి హాలీవుడ్ నటులను శంకర్ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
2.0 ఆడియోకు 25 కోట్లు?
Reviewed by CHANDRA BABU
on
June 21, 2017
Rating: 5
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ 2.0. భారతీయ చిత్రాల్లోనే దాదాపు 350 కోట్లకు మించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: