అనుకున్న సమయానికి దువ్వాడ జగన్నాథమ్ మూవీని విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్‌రాజు మంగళవారం ప్రకటించాడు. దీంతో ఈనెల 23న థియేటర్స్‌కి డీజే రానుంది. పాటలో అస్మైక యోగ- తస్మైక పదాలను మార్చేశామని, అలాగే నమకం, చమకం స్థానంలో గమకం, సుముఖం పదాలు చేర్చి సెన్సార్ సర్టిఫికెట్ పొందామన్నాడు. దీంతో డీజేకి లైన్ క్లియర్ అయ్యిందని యూనిట్ భావించింది.
ఇదిలావుండగా డీజేపై మంగళవారం బ్రాహ్మణ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా ఉన్నాయంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు. దీంతో డీజే వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఈ పిటిషన్‌తో డీజే అనుకున్న టైమ్‌కి విడుదల అవుతుందా అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. తక్కువ సమయం వుండడంతో ఈ ఇష్యూని నిర్మాత ఎలా డీల్ చేస్తారని అంటున్నారు. దువ్వాడకు వివాదాలేమోగానీ, ఈ విధంగా ప్రమోషన్ వచ్చేసిందని అంటున్నారు.

No comments: