లష్కర్ ఘా: దక్షిణ ఆఫ్ఘాన్ ప్రావిన్స్ హెల్మాండ్ రాజధాని లష్కర్ ఘాలో తీవ్రవాదులు కారు బాంబుతో విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది, మరికొందరు పౌరులు... తమ జీతాల కోసం న్యూ కాబూల్ బ్యాంకు వద్ద వేచి ఉండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దాడిలో మొత్తం 20 మందికి పైగా మరణించారనీ, 50 మంది వరకు గాయపడ్డారని హెల్మండ్ గవర్నర్ ప్రతి
నిధి ఒకరు వెల్లడించారు. మరోవైపు మరణించిన వారి సంఖ్య 30 మంది వరకు ఉంటుందని స్థానిక మీడియా చెబుతోంది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తాలిబన్లు, ఐఎస్ఐఎస్ సహా ఎవరూ ఈ దాడిపై ఇంకా నోరు విప్పలేదు. గత నెలలో కూడా గార్డెజ్ నగరంలో ఇదే తరహాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడగా... ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

No comments: