మొన్న ధోనీపై... నేడు కోహ్లీపై - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మొన్న ధోనీపై... నేడు కోహ్లీపై

దిల్లీ: ఐపీఎల్-10వ సీజన్లో పుణె ఆటగాడు, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై విరుచుకుపడిన హర్ష గొయాంక తాజాగా భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీపై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో బీసీసీఐ ఆ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ యజమాని సంజీవ్ గొయాంక సోదరుడైన హర్ష ట్విటర్ ద్వారా స్పందించారు. భారత క్రికెట్ జట్టుకి కోచ్ కావాలి. వారు ఎలా ఉండాలంటే సారథి పట్ల ఎంతో విధేయతతో, బీసీసీఐపై ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి అయి ఉండాలి అని తెలిపారు. ట్విటర్ ఖాతాలో కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోమని ఆయన సూచిస్తూ ఏమని పేర్కొన్నారంటే..
'ఇండియన్ క్రికెట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోండి..
అర్హతలు:
* టీమిండియా పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ను ఉత్తమంగా నిర్వహించడం.
* హోటల్ గదులు కేటాయించడం.
* బీసీసీఐ, భారత క్రికెట్ సారథి పట్ల విధేయతగా ఉండటం.. అని హర్ష సూచించారు.
జులై 9వరకు బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు స్వీకరించనుంది. అదే నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆ పర్యటనకు ముందే కోచ్ను ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రతినిధులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టామ్ మూడీ, సెహ్వాగ్ రేసులో ముందున్నారు.
మొన్న ధోనీపై... నేడు కోహ్లీపై Reviewed by CHANDRA BABU on June 28, 2017 Rating: 5 దిల్లీ: ఐపీఎల్-10వ సీజన్లో పుణె ఆటగాడు, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై విరుచుకుపడిన హర్ష గొయాంక తాజాగా భారత క్రికెట్ జట్టు సారథి ...

No comments: