బ్రస్సెల్స్: ప్రసిద్ధ సెర్చింజిన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్(ఈయూ) భారీ షాకిచ్చింది. తమకు కావాల్సిన సేవలు, ఉత్పత్తుల కోసం వెతుకులాడే వినియోగదారులకు, తన సొంత సేవలే అధికంగా కనిపించేలా గూగుల్ వ్యవహరిస్తోందని ఈయూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక, ఇలాంటి పెత్తందారీ విధానాలు అవలంభిస్తున్నందుకు, సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు ఈయూ 2.4బిలియన్ యూరోల(సుమారు 2.7బిలియన్ డాలర్లు(రూ.17వేల కోట్లు)) జరిమానా విధించింది. 2010లో ఈ కేసు దాఖలైన విషయం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా సెర్చ్ ఇంజిన్ విపణిలో ఆధిపత్యం కలిగిన గూగుల్, తన షాపింగ్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, ఆ స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని యూరోపియన్ కమిషన్ కాంపిటీషన్ చీఫ్ మెద్‌థే వెసగర్ తెలిపారు.
వినియోగదారులు సెర్చ్ చేసినప్పుడు, గూగుల్ ఆన్‌లైన్ సేవ అయిన గూగుల్ షాపింగ్‌కే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోందని, ట్రిప్ అడ్వైజర్, ఎక్స్‌పెడియా వంటి సేవలు హాన కలుగుతోందని వివరించారు. ఇలాంటి నియంతృత్వ, అనైతిక చర్యలను సహించమని పేర్కొన్నారు.
ఐరోపా ఆందోళనలకు అనుగుణంగా గూగుల్ షాపింగ్ తన వ్యాపార విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. కాగా, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తామని గూగుల్ తెలిపింది.

No comments: