హిందీలో ఘన విజయం సాధించిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాలా చిత్రంగా రీమేక్ చేశారు. అందులో హీరో వెంకటేశ్. ఈ చిత్రంలో కీలక పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించి దుమ్ము రేపాడు. అలా టాలీవుడ్‌లో అరుదైన కాంబినేషన్‌కు తెర లేచింది. వెంకటేశ్ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించడానికి పవర్ స్టార్ సిద్ధపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల సాధ్యమైందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో వెంకటేశ్, పవన్ క్లోజ్ ఫ్రెండ్స్. తాజాగా తన స్నేహితుడు పవన్ కోసం అతిథి పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది.
దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్‌తో ప్రస్తుతం పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం కొద్ది రోజులుగా ఎవరైతే బాగుంటుందనే దర్శక, నిర్మాతలు తెగ ఆలోచించారంట. ఎందుకంటే సినిమాలో కీలకంగా ఉంటే పవన్ మామ పాత్రంట. పవన్‌కు మామగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని పలువురు పేర్లను పరిశీలించినట్టు తెలిసింది.

No comments: