భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెన్నెత్ ఐ జస్టర్ భారత్‌కు రాయబారిగా నియమితుడు కానున్నారు. త్వరలో ఆయన నియామక ఉత్తర్వులు వెలువడుతాయని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ఆయన నియామకం కాంగ్రెస్ ఆమోదం పొందితే రిచర్డ్ వర్మ స్థానంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపడుతారు. భారత్ వ్యవహారాలపై లోతైన పరిజ్ఞానమున్న జస్టర్ భారత్‌లో అమెరికా రాయబారి పదవికి తగిన వ్యక్తి అని వైట్‌హౌస్ ప్రతినిధి లిండ్సే ఈ వాల్టర్స్ పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయలుదేరుతారనగా ఈ నియామక వార్త వెలుగు చూడడం గమనార్హం.
భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్ Reviewed by CHANDRA BABU on June 22, 2017 Rating: 5 వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెన్నెత్ ఐ జస్టర్ భారత్‌కు రాయబారిగా నియమితుడు కానున్నారు. త్వరలో ఆయన నియామక ...

No comments: