నెల్లూరు, డిసెంబర్ 19, (రవికిరణాలు) : సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే కాకాణి, లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూసర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 35 మందికి 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించామన్నారు.ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరోగ్య శ్రీ నుంచి లబ్ది పొందని వాళ్లకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇవ్వడం జరిగింది.ఆర్థికంగా చితికి పోతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చెక్కులను ఇవ్వడం జరిగింది.గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రజల అర్జీలు పంపిస్తే ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను ఇవ్వొద్దని అప్పట్లో చెప్పడం జరిగింది.గతంలో చంద్రబాబు సొంత డబ్బులు ఇవ్వమని అడగలేదు, ప్రభుత్వం నుంచి రావల్సిన వాటినే అడిగిన ఇవ్వలేదన్నారు.దాని వల్ల గతంలో అనారోగ్యంతో డబ్బులు ఖర్చు చేసిన వాళ్లకు చెక్కులు ఇవ్వలేక పోవడంతో వాళ్ళు ఆర్థికంగా చితికి పోయారు. తెలుగుదేశం వాళ్లకు మాత్రమే చెక్కులను చంద్రబాబు విడుదల చేశాడు.కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధులను విడుదల చేస్తున్నారు.అభివృద్ధి నిధులను కూడా కుప్పంతో సహా అందరికి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారు.పొరుగు రాష్ట్రాలలో కూడా ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అవడంతో వాటిని పట్టుకుని చాలా మంది తిరుగున్నారు.గతంలో చంద్రబాబు పేద వాళ్ళను ఇబ్బంది పెట్టడమే కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ఇబ్బంది పెట్టాడు.కానీ జగన్మోహన్ రెడ్డి అందరూ బాగుండాలి అనే విధంగా పాలన సాగిస్తున్నారు.అటువంటి మంచి మనిషికి మీరందరూ బాసటగా నిలవాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.మీరందరూ ఆయురా రోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
No comments: