శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

నెల్లూరు, డిసెంబర్‌07, (రవికిరణాలు) : నెల్లూరు దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు.వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు ఆధ్యాత్మిక భావన కలిగిన వారికే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ లో చోటు కల్పించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.1975వ సంవత్సరంలో స్థాపించిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి మొదటిసారి ట్రస్ట్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కే దక్కుతుందని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కమిటీ సభ్యులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించారు.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం Reviewed by CHANDRA BABU on December 07, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌07, (రవికిరణాలు) : నెల్లూరు దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార...

No comments: