ఘనంగా 57వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఘనంగా 57వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయము
పోలీసులతో సమానంగా హోంగార్డులకు పలు సంక్షేమ పథకాలు అమలు
నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : శుక్రవారం 57వ హోం గార్డుల వ్యవస్థాపక దినోత్సవం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా నిరహించబడింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ యస్పి(ఎ.ఆర్)యస్.వీరభద్రుడుతో కలిసి ముఖ్య అతిధిగా విచ్చేసి పెరేడ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ యస్పి మాట్లాడుతూ జిల్లాలో హోం గార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలు జిల్లా ప్రజలకు అందిస్తున్నారని, గత జనరల్ ఎలక్షన్ ల మొదలు విఐపి, డబ్ల్యూఐపి తిరుమల బ్రహ్మోత్సవాలు, విజయవాడ బ్రహ్మోత్సవాలు,రొట్టెల పండుగ, వెంకటగిరి పోలేరమ్మ జాతర బందోబస్త్ లను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించి నెల్లూరు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చినారని అభినందించారు. గత ఎలక్షన్ లలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన హోం గార్డు యూనిట్ సభ్యులందరికీ జిల్లా యస్పి ఐశ్వర్య రస్తోగి ఒక జత యూనిఫాం ను బహుమతిగా ఇచ్చినందుకు జిల్లాలోని హోం గార్డుల అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హోం గార్డు యూనిట్ డియస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 74 మంది మహిళలతో కలిపి 765 మంది హోం గార్డులు విధులు నిర్వహిస్తున్నారని, వీరిలో 613 మంది ఎల్‌ అండ్‌ ఒ, ట్రాఫిక్, మెరైన్ పోలీస్, కమాండ్ కంట్రోల్, బి.డి.టీం, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్, పోలిస్ బ్యాండ్, పోలీస్ హాస్పిటల్, పోలీస్ స్టోర్స్, పిటిసి లాంటి ప్రధాన విభాగాలతో పాటు సిఐడి, ఏసిబి, ఆర్టివో, ఇంటలిజెన్స్, వి ఆండ్‌ ఈ, ట్రాన్స్ కో, ఏపి జెన్కో, జైలు, పైర్, ఎఫ్‌సిఐ మొదలగు విభాగాలో పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. హోం గార్డుల సంక్షేమంలో భాగంగా గౌరవ సి.యం జి.ఒ. నం.876 ప్రకారం నెల జీతం 18,000 నుండి 21,000 వరకు పెంచడం ఎంతో హర్షనీయమని తెలిపారు. ఇంకా యాక్సిస్ బ్యాంక్ ద్వారా జీరో బ్యాలన్స్ అకౌంట్ ప్రారంభించి ప్రమాదవశాస్తు మరణిస్తే 30,00,000భీమా సదుపాయం అలాగే పోలీసు ఆసుపత్రిలో హోం గార్డులకు ఉచిత వైద్య సదుపాయం, సబ్సిడీ క్యాంటీన్ నందు స్మార్ట్ కార్డు సదుపాయం, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నందు ఐదు లక్షలు వరకు కార్పోరేట్ వైద్య సదుపాయం మొదలగు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో చనిపోయినా లేదా పదవీ విరమణ పొందినవారికి ఒక్కరోజు వేతనం అందరూ స్వచ్చండంగా అందజేయటం మన జిల్లాలోనే మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా డియస్పి తెలిపారు. ఈ కార్యక్రమానికి యన్.శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానం చేయగా, పెరేడ్ కమాండర్ మస్తాన్ ఆర్‌ఐ రమణ ఆద్వర్యంలో మార్చ్ ఫాస్ట్ మనోహరంగా కొనసాగింది. అనంతరం అడిషనల్ యస్పి (ఎ.ఆర్.) హోం గార్డు ప్లటూన్ లకు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించగా అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ఆర్టీసీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పి(ఎ.ఆర్.) యస్.వీరభద్రుడు, డియస్పి(హెచ్‌జి యూనిట్) డి.శ్రీనివాస రావు, యస్.బి డియస్పి యన్ కోటా రెడ్డి, డియస్పి నెల్లూరు టాన్ జె.శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు రూరల్ డియస్పి రాఘవ రెడ్డి, ట్రాఫిక్ డియస్పి పి.మల్లికార్జున రావు, డియస్పి(ఎ.ఆర్) రవీంద్ర రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ లు అందరూ, రిజర్వు ఇన్స్పెక్టర్ లు, హోం గార్డు అసోసియేషన్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా 57వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయము పోలీసులతో సమానంగా హోంగార్డులకు పలు సంక్షేమ పథకాలు అమ...

No comments: