- పోటీలకు 84మంది మున్సిపల్ విద్యార్థుల ఎంపిక
- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 12, (రవికిరణాలు) : గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో రేపట్నుంచి జరగనున్న 2వ రాష్ట్ర స్థాయి మున్సిపల్ పాఠశాలల క్రీడోత్సవాల్లో నెల్లూరు కార్పొరేషన్ సత్తా చాటాలని కమిషనర్ పివివిస్ మూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. క్రీడోత్సవాలకు ఎంపికైన విద్యార్థులకు క్రీడా దుస్తులను స్థానిక కూరగాయల మార్కెట్టు సమీపంలోని సుంకు చెంగన్న మున్సిపల్ పాఠశాలలో గురువారం అందజేశారు. కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహించిన జిల్లా క్రీడా పోటీల్లో 800 మంది ఎంపికవగా, వారిలోనుంచి 84 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో సుశిక్షితులైన కోచ్ ల ఆధ్వర్యంలో అత్యంత క్రమశిక్షణతో విద్యార్థులు మెలగాలని కమిషనర్ సూచించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని క్రీడాకారులను కమిషనర్ ఆకాంక్షించారు.

No comments: