అపోలో హాస్పిటల్ లో 25 నుండి 50 శాతం వరకు రాయితీలతో వైద్య పరీక్షలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అపోలో హాస్పిటల్ లో 25 నుండి 50 శాతం వరకు రాయితీలతో వైద్య పరీక్షలు

నెల్లూరు, డిసెంబర్‌07, (రవికిరణాలు) : ఇటీవల మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, ఆహారపు అలవాట్ల నేపద్యంలో ప్రబలుతున్న వ్యాధుల నుంచి ప్రజలు ఉపశమనం కొసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రత్యేక రాయితీలతో కూడిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీ నుండి 31వ తేదీ వరకూ వైద్య పరీక్షలపై రాయితీలను ప్రకటించింది. దీనిపై అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాం సతీష్, హెల్త్ చెకప్ విభాగ అధిపతి డాక్టర్ అనిత విలేకరుల సమావేశం నిర్వహించి రాయితీల వివరాలను తెలియజేశారు. హోల్ బాడీ చెకప్ తో పాటూ గుండె సంబంధమైన పరీక్షలను 25 శాతం రాయితీతో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే మహిళలకు సంబంధించిన మేమోగ్రామ్ పరీక్షలను 50 శాతం రాయితీతో నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ నవీన్, హెల్త్ చెకప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అపోలో హాస్పిటల్ లో 25 నుండి 50 శాతం వరకు రాయితీలతో వైద్య పరీక్షలు Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌07, (రవికిరణాలు) : ఇటీవల మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, ఆహారపు అలవాట్ల నేపద్యంలో ప్రబలుతున్న వ్యాధుల నుంచి ప్రజలు ...

No comments: