- సత్యం రెడ్డి పై అక్రమ కేసులు అన్యాయం- చేజర్ల
కోవూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): ఈ రాష్ట్రంలో అధికార పార్టీ వారికి మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని,ప్రతిపక్ష పార్టీలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఇటీవల ప్రభుత్వం అక్రమముగా కేసులు బనాయించగా బెయిలు పై విడుదల అయిన విడవలూరు మండల తెలుగుయువత అధ్యక్షుడు సత్యం రెడ్డిని విడవలూరు గ్రామములో వారి స్వగృహములో పరామర్శించి అనంతరం పత్రికా విలేఖరుల సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెపుతు న్నారని కానీ నిజానికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ వారికి మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ప్రతిపక్ష పార్టీల కు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని, ప్రతిపక్ష పార్టీలు వారిని కించపరుస్తూ వైస్సార్సీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పై ఎటువంటి కేసులు పెట్టకుండా,తెలుగుదేశం పార్టీ వారి పై మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుండి ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేద్దామనే ఆలోచన మానేసి, తెలుగుదేశం పార్టీ కార్యాకర్తలను ఏవిధంగా వేధించాలి,వారి పై ఎటువంటి అక్రమ కేసులు బనాయించాలి అనే దాని పై నే దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ వారిని వేధిస్తున్నారని,తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీమతి పంచమర్తి అనురాధ,రాజమండ్రి శాసనసభ్యురాలు అదిరెడ్డి భవాని ల పై వైస్సార్సీపీ కార్యాకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెట్టారని,పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ప్రభుత్వం వారి పై ఎటువంటి కేసులు పెట్టకుండా,కేవలం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై కేసులు పెడుతున్నారని,ఇటువంటి కేసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడే వారు కాదని, సత్యం రెడ్డి పై అక్రమ కేసు పెట్టగా అతనికి తెలుగుదేశం పార్టీ అంతా అండగా నిలిసిందని,భవిష్యత్తు లో కూడా పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని,ప్రభుత్వం ఇప్పటికయినా తెలుగుదేశం పార్టీ కార్యాకర్తలను వేధించటం మాని రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టాలని,అదేవిధముగా పాలకులు మారుతుంటారు గాని అధికారులు శాస్వితంగా ఉంటారని,కావున అధికారులు అధికారపక్షం కొమ్ము కాయకుండా న్యాయంగా వ్యవహరించాలని, అదేవిధముగా సత్యం రెడ్డి ని అరెస్టు అయిన క్షణం నుండి విడుదల అయ్యే వరకు అండగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, పట్టిపాటు పుల్లారావుకి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, బీద రవిచంద్రకి ఇతర నాయకులకు కోవూరు తెలుగుదేశం పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా తెలుగుదేశం పార్టీ యెస్ సి సెల్ ప్రధానకార్యదర్శి దారా విజయబాబు,కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరు కృష్ణయ్య, విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాశం శ్రీహరి రెడ్డి, చెముకుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

No comments: