ఫ్లెమింగో ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరం చేయాలి - జిల్లా కలెక్టరు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఫ్లెమింగో ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరం చేయాలి - జిల్లా కలెక్టరు

నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : జిల్లాలో ఫ్లెమింగో ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టరు ఎం.వి. శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరు వారి క్యాంపు కార్యాలయంలో రెండవ సంయుక్త కలెక్టరు కె.ఎం. కమలకుమారితో కలసి ఫ్లెమింగో ఉత్సవాలు ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఫ్లెమింగో ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాల్సి వుందన్నారు. ఈ ఫ్లెమింగో ఉత్సవాలకు నోడల్ అధికారిగా రెండవ సంయుక్త కలెక్టరు, సమన్వయ అధికారిగా వన్యమృగ డి.ఎఫ్.ఓ. హిమ శైలజ వ్యవహరించాలన్నారు. ప్రోటోకాల్ ఏర్పాట్లు నుడా వైస్ చైర్మెన్ బాపిరెడ్డి, నాయుడు పేట ఆర్.డి.ఓ. సరోజిని చూసుకోవాలన్నారు. సూళ్లూరు పేట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే ప్రదర్శనశాలలు ప్రజలకు వివిధ ప్రభుత్వ పథకాలు అర్థమయ్యే రీతిలో, ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా వివిధ రకాల పక్షుల వివరాలను పొందుపరచాలన్నారు. ఉత్సవాలు జరిగే నాలుగు ప్రదేశాల్లో ఎక్కడ ఎటువంటి అపరిశుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలు తొలగించే విధంగా పారిశుధ్యం పై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని ప్రదేశాల్లోను ఆయా ప్రభుత్వ శాఖలు నిర్వహించే పనులకు సంబంధించి విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని కేటాయిస్తు ఉత్తర్వులు యివ్వాలన్నారు. అన్ని ప్రదేశాల్లోను సదర్శకులకు, విద్యార్థులకు మంచినీటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక చిత్రపటం తయారుచేసి రాక పోకలకు అంతరాయం కలుగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు సూచించాలన్నారు. ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలతో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బి.వి.పాళెంలో పడవ షికారు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బారి కేడింగు, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లు అందుబాటులో సిద్ధంగా వుండాలన్నారు. సందర్శకులు పెరిగిన సమయంలో అందుకు తగ్గట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధంగా వుండాలన్నారు. మూడు రోజుపాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే సందర్శకులకోసం రైల్వే స్టేషన్, బస్టాండులలో మంచినీరు తదితర కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. సందర్శకులు అనుకోకుండా అనారోగ్యానికి గురైతే వారికి వెంటనే వైద్యం అందించేందుకు వీలుగా డాక్టర్లు మందులతో కూడిన అవసరమైనన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పాఠశాలల విద్యార్థులు, స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డి.ఇ.ఓ., ఎస్.ఎస్.పి.ఓ.లకు సూచించారు. ఉత్సవాలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఉత్సవాలు ఎప్పటికప్పుడు సజావుగా జరి గేలా పర్యవేక్షించేందుకు వీలుగా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, అటవిశాఖ, తదితర శాఖల అధికారులతో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల విజ్ఞానయాత్ర కోసం అవసరమైనన్ని బస్సులనుసమకూర్చాలన్నారు. ఈ సమావేశంలో నుడా వైస్ చైర్మెన్ బాపిరెడ్డి, జిల్లా పర్యాటక అధికారి శ్రీనివాసకుమార్, నాయుడు పేట ఆర్.డి.ఓ. సరోజిని, వన్యమృగ డి.ఎఫ్.ఓ. హిమ శైలజ, డి.ఆర్.డి.ఎ., డ్వామా పి.డి.లు శీనా నాయక్, జ్యోతిబసు, సెట్నెల్ సి.ఇ.ఓ. సుస్మిత, డి.ఇ.ఓ. జనార్థనాచార్యులు, సమగ్రశిక్ష పి.ఓ. బ్రహ్మనంద రెడ్డి, డి.ఎస్.ఓ. బాలకృష్ణారావు, డి.టి.సి. సుబ్బారావు, మత్స్యశాఖ జె.డి. శ్రీహరి బి.సి. సంక్షేమ అధికారిణి రాజేశ్వరి, ఐ.సి.డి.ఎస్.పి.డి. సుధాభారతి, సాంఘిక సంక్షేమశాఖ డి.డి. జీవ పుత్రకుమార్, సమాచార శాఖ డి.డి ఎమ్. వెంకటేశ్వర ప్రసాద్, డి.ఇ.ఐ.ఇ. కిషోర్, సూళ్లూరు పేట మున్సిపల్ కమిషనరు నరేంద్ర
కుమార్ పాల్గొన్నారు.
ఫ్లెమింగో ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరం చేయాలి - జిల్లా కలెక్టరు Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : జిల్లాలో ఫ్లెమింగో ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర...

No comments: