తిరుమలలో"గొల్ల మండపం"తొలగించ వద్దు...బిజెపినిరసన - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుమలలో"గొల్ల మండపం"తొలగించ వద్దు...బిజెపినిరసన

రీసనల్ జాయింట్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావుకు వినతి.....
నెల్లూరు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి ఎదురుగా వున్న గొల్ల మండపం తొలగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు మిడతల రమేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600ఏళ్ళనాటి చరిత్రను రూపుమాపాలని ప్రభుత్వం కుట్ర చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. సన్నిధి గొల్లను టీటీడీ ఉద్యోగిగా జగన్ సర్కార్ ప్రకటించి వారి ద్వారా గొల్ల మండపం తొలగించే సంప్రదింపులు ప్రారంభించిందన్నారు. చంద్రగిరికి చెందిన యాదవ మహిళ తన సంపాదనతో మండపం నిర్మాణం చేసిందని దానిని తొలగించే హక్కులు ఎవ్వరికి లేదని విమర్శించారు. పురాతన మండపంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చరిత్రకు సాక్షంగా ఉంచాలి.2013లో మండపం తొలగించే ప్రయత్నం చేసి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. గొల్ల మండపం మత విశ్వాసాలకు భావోద్వేగాలకు చెందినదని, ఈ మండపం జోలికి వెళితే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు గంగుల జనార్దన్, ఓ.సుదార్కార్ రత్నం, వెంకట సుబ్బయ్య, పి.రామకృష్ణా, రమణ రెడ్డి, నాగఫణి, సురేశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో"గొల్ల మండపం"తొలగించ వద్దు...బిజెపినిరసన Reviewed by CHANDRA BABU on December 18, 2019 Rating: 5 రీసనల్ జాయింట్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావుకు వినతి..... నెల్లూరు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి ఎదురుగా వ...

No comments: