నెల్లూరు, డిసెంబర్07, (రవికిరణాలు) : ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఏవిధమైన ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టరు ఎం.వి.శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో రైతుల వద్ద నుండి ధాన్యం సేకరణ మీద వచ్చే సమస్యలను అధి గమించడానికి కలెక్టరుగారి అధ్యక్షతన సంబంధిత అధి కారులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ధాన్యం సేకరణ విషయంలో సంబంధిత శాఖల వారు తీసుకొనవలసిన చర్యలు త్వరితగతిన తీసుకొని ఫిబ్రవరి మాసం నాటికి ధాన్యం సేకరణకు సిద్ధంగా వుండవలసిందిగా అధికారులను కోరారు. సంబంధిత శాఖల వారికి జనవరి నెల నుండి శిక్షణ యిచ్చి ప్రొక్యూర్ మెంట్ సక్రమంగా వుండేలా ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ధాన్యం మిల్లుల యజమానులను కలసి ఏ మిల్లు ఎంత టైం పనిచేస్తుందో తెలుసుకొని మిల్లర్ల లిస్టు తయారు చేసుకోవాలన్నారు. రైతులకు అనుకూలంగా వుండే సమయంలోనే వారికి తగిన శిక్షణ యివ్వాలన్నారు. టెక్నాలజి పార్ట్ కి సంబంధించి రైతులకు అర్థమయ్యేలా అధికారులు శిక్షణనివ్వాలన్నారు. హెల్ప్ లైన్ పెట్టి ఆ నెంబరు అందరికి తెలిసేలా చేసి రైతులకు ఏ సమస్య లేకుండా చూడాలన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా వుంటే వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలన్నారు. డిజిటల్ మాయిశ్చ రైజ్ యంత్రాలను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ఏవైనా సమస్యలు వుంటే ఈనెల 15 లోపు ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు తీసుకోవలసిన చర్యల గురించి తగు సూచనలు, సలహాలు యిచ్చారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టరు డా. వి.వినోద్ కుమార్, డి.ఆర్.డి.ఎ. పి.డి. శీనా నాయక్, వ్యవసాయశాఖ జె.డి. ఆనందకుమారి, పౌర సరఫరాల డి.ఎం. రోజ్ మాండ్, పౌర సరఫరాల అధికారి బాలకృష్ణారావు, మార్కెటింగ్ ఎ.డి., లీగల్ మెట్రాలజి, తదితర అధికార్లు
పాల్గొన్నారు.
పాల్గొన్నారు.
No comments: