భద్రత ఎక్స్ క్రెషియా చెక్కును అందచేసిన జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

భద్రత ఎక్స్ క్రెషియా చెక్కును అందచేసిన జిల్లా యస్పి భాస్కర్ భూషణ్

నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ విధి నిర్వహణలో మరణించిన మృతిని కుటుంబానికి భద్రత ఎక్స్ క్రెషియా చెక్కుని అందజేశారు. వివరములోకి వెళ్ళితే పి.సి.431 బి.ఆదిశేషయ్య అనారోగ్యంతో 02.10.2018వ తేదీ నాడు మరిణించినారు. వీరికి రావలసిన భద్రత ఎక్స్ క్రెషియా క్రింద రూ.4,00,000 చెక్కును మృతుడి కొడుకు అయిన బి.రమణయ్య(5) పేరు మీద ఫిక్సెడ్ డిపాసిట్ చేసిన చెక్కును మృతుడు బార్య అయిన బి.పెంచలమ్మకి అందచేశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వీరికి ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా వచ్చి కలవవచ్చు అని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అద్యక్షులు మద్దిపాటి ప్రసాద్ రావు, ఏ.ఓ. యం.విజయకుమార్, బి.సెక్షన్ సూపరింటెండెంట్ ఎస్.రామనారాయణ రెడ్డి, బి.సెక్షన్ క్లర్క్ రమేష్ పాల్గొన్నారు.
భద్రత ఎక్స్ క్రెషియా చెక్కును అందచేసిన జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ Reviewed by CHANDRA BABU on December 09, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ విధి నిర్వహణలో మరణించిన మృతిని కుటుంబాన...

No comments: