శిక్షణకు బయలుదేరిన పోలీసు కానిస్టేబుల్స్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శిక్షణకు బయలుదేరిన పోలీసు కానిస్టేబుల్స్

నెల్లూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) :2018వ సంవత్సరానికి సంబంధించిన స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్, మంగళగిరి నోటిఫికేషన్ ప్రకారం ప్రకారం నెల్లూరు జిల్లా నుండి 187 మంది అభ్యర్ధులు సివిల్, ఏ.ఆర్. కానిస్టేబుల్స్ గా ఎన్నిక అయినారు. ఇందులో 48 మంది సివిల్ ఉమెన్ పిసిఎస్‌ గానూ, 4 ఏ.ఆర్. ఉమెన్ పిసిఎస్‌ గానూ సెలెక్ట్ కావడం జరిగింది. వీరంతా స్టెఫండరీ పోలీస్ క్యాడేట్ హోదాలో 9 నెలల శిక్షణ వివిధ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు మరియు జిల్లా ట్రైనింగ్ కాలేజీలలో పొందవలసి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం జిల్లా పోలీసు కవాతు మైదానం నందు నెల్లూరు జిల్లా నుండి సెలెక్ట్ కాబడిన 187 మందికి గానూ 173 మంది సభ్యులు హాజరు కాగా వారిలో 96 మందిని కల్యాణ్ డ్యామ్, తిరుపతి పిటిసి కి, 48 మంది మహిళా సివిల్, 04 ఏ.ఆర్ పిసి లను ఒంగోలు పిటిసి కి, 25 మంది ఏ.ఆర్. పిసి లను మచిలీపట్నం డిటిసి కి జిల్లా యస్పి భాస్కర్ భూషణ్, ఆదేశాల మేరకు ఏ-సూపరింటెండెంట్ చంద్రమౌళి కోఆర్డినేషన్లో 4 బస్లలో శిక్షణకు పంపడం జరిగింది.
శిక్షణకు బయలుదేరిన పోలీసు కానిస్టేబుల్స్ Reviewed by CHANDRA BABU on December 10, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) : 2018వ సంవత్సరానికి సంబంధించిన స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్, మంగళగిరి నోటిఫికేషన్ ప్రకారం...

No comments: