అక్రమంగా పెన్షన్ తొలిగిస్తే ఆందోళన చేస్తాం - నుడా మాజీ చైర్మన్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అక్రమంగా పెన్షన్ తొలిగిస్తే ఆందోళన చేస్తాం - నుడా మాజీ చైర్మన్

నెల్లూరు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): బుధవారం నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇస్తానని అరిచి గోలపెట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పారని అన్నారు.జగన్ పాలన కంటే తుక్లాక్ పాలనే బెటర్ అని భావన లో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పారు.సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా చేసేందుకు సీఎం జగన్ వాలేంటరీ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. జగన్ జీవితమంతా అబద్దాలు, అరాచకాలు, నాటకాలతో నిండి పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.అమ్మఒడిని ఇవ్వకుండా తప్పించుకునేందుకే రేషన్ కార్డ్స్ ను తొలగించబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవారిని అధికార పార్టీకి చెందిన నాయకుకు గాని, అధికారులు గాని ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.అక్రమంగా అవ్వా తాతలకు పెన్షన్ తొలిగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.మాటఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ప్రజల తరపున మేము నిలధిస్తామన్నారు. చంద్రబాబు నాయుడిలా పాలించేందుకు ప్రయత్నించండి అంతేకాని చేతగాకపోతే తప్పుకోండి అంటూ హితవు పలికారు.
అక్రమంగా పెన్షన్ తొలిగిస్తే ఆందోళన చేస్తాం - నుడా మాజీ చైర్మన్ Reviewed by CHANDRA BABU on December 18, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): బుధవారం నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ...

No comments: