పట్టించుకోని అధికారులు..
సూళ్లూరుపేట, డిసెంబర్07, (రవికిరణాలు) : సూళ్లూరుపేట మండలం పరిధిలోని పంధలగుంట రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉందని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. ఇక పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు పరిస్థితి దయనీయంగా మారింది. మామూలుగానే అధ్వానంగా ఉన్న రోడ్లు వర్షం కురిస్తే నరకానికి నకళ్లుగా మారుతున్నాయి అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకు పెద్ద పెద్ద నాయకులు ఉండే మండలం అయినప్పటికీ మండలంలోని అధ్వానంగా ఉన్న రోడ్ల ను పట్టించుకునే నాథులే లేరని మండలంలోని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి రోడ్ల సమస్యలు తీసుకెళ్లినా ఫలితం లేదని ప్రజలు తెలుపుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని రోడ్లను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

No comments: