లారీ వాహనాల దొంగ ఆట కట్టించిన పోలీసులు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

లారీ వాహనాల దొంగ ఆట కట్టించిన పోలీసులు

- వ్యసనాలకు బానిసై, జల్సాలకు అలవాటుపడి మారు తాళాలతో వాహనాలను దొంగిలించే ముద్దాయి అరెస్ట్
ఆక్వా ఫీడ్ లోడుతో వున్న లారీ స్వాధీనం
నెల్లూరు, డిసెంబర్‌ 16, (రవికిరణాలు) : నెల్లూరు సిటి లో ఈ మధ్య జరిగిన ద్విచక్ర, భారీ వాహనాల దొంగతనాల గురించి జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు, క్రైమ్స్ అడిషనల్ యస్పి పి.మనోహర రావు సూచనల మేరకు, ఇంచార్జ్ నెల్లూరు టౌన్ డియస్పి పి.శ్రీధర్ పర్యవేక్షణలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వై.వి.సోమయ్య, ఎస్సైలతో కలిసి నెల్లూరు సిటిలో, బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో 13వ తేది జరిగిన ఆక్వా ఫీడ్ లోడుతో వున్న 12 టైర్ ల అశోక్ లైలాండ్ లారీ దొంగతనానికి పాల్పడిన నేరస్తుని ఓజిలి మండలం, రాజుపాలెం క్రాస్ రోడ్, జాతీయ రహదారికి తూర్పు వైపు రోడ్ మార్టిన్ లోని నాయుడు హోటల్ ముందు అరెస్ట్ చేసినారు. ఆక్వా ఫీడ లోడుతో కలిపి 12 టైర్ ల అశోక్ లైలాండ్ లారీ విలువ సుమారు రూ.43,00,000 యామాల చైతన్య అనే ముద్దాయి వ్యసనాలకు బానిసై, జల్సాలకు అలవాటుపడి మారు తాళాలు ఉపయోగించి నెల్లూరు జిల్లాలో వివిధ ప్రదేశాలలో నేరాలకు పాల్పడుతుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ముద్దాయి వద్ద నుండి రూ.43,00,000 విలువ చేసే ఆక్వా ఫీడ్ లోడుతో వున్న లారీ ని బాలాజీనగర్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
లారీ వాహనాల దొంగ ఆట కట్టించిన పోలీసులు Reviewed by CHANDRA BABU on December 16, 2019 Rating: 5 - వ్యసనాలకు బానిసై, జల్సాలకు అలవాటుపడి మారు తాళాలతో వాహనాలను దొంగిలించే ముద్దాయి అరెస్ట్ ఆక్వా ఫీడ్ లోడుతో వున్న లారీ స్వాధీనం నెల్లూరు, డిస...

No comments: