రాష్ట్రంలోనే నగర కార్పొరేషన్‌ను ప్రథమ స్థానంలో ఉంచుతాం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రాష్ట్రంలోనే నగర కార్పొరేషన్‌ను ప్రథమ స్థానంలో ఉంచుతాం

- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్
నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 14వ బాలాజీనగర్, ఏసినగర్ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో శానిటేషన్ సమస్య అధికంగా ఉందని, త్వరితగతిన సమస్యను పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొంచాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. ఇళ్ళ మధ్యలో ఉన్న కాలువలు చెత్తా చెదారాలతో నిండిపోయి ఉన్నాయని, వర్షాలు వస్తే నీరు పారే పరిస్థితి కనిపించకపోవడంతో, ఇళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువల గట్లపై నివసిస్తున్న వారి ఇళ్ళను ప్రస్తుతం తొలగించడం లేదని, వారికి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పడం జరిగిందన్నారు. డిసెంబర్ 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆరోజు నుంచి మూడు నెలలలోపు ఒక సచివాలయానికి సుమారు 300మొక్కలు చొప్పున నాటి నగరాన్ని పచ్చదనంగా రూపొందిస్తామన్నారు. మొక్కలు నాటాం.. వదిలేశాం.. అన్నట్లు కాకుండ ప్రతి చెట్టును బతికించే కార్యక్రమం చేపడుతామన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిందని, ఏ కార్యక్రమాన్నైనా ఓ ప్రణాళిక ప్రకారం రూపొందించి నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని, గత ప్రభుత్వం మాదిరి నామమాత్రపు పనులు చేపట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. మరో ఏడాదిన్నరలోగా రాష్ట్రంలోనే నెల్లూరు నగర కార్పొరేషన్‌ను ప్రథమ స్థానంలో నిలబడెతానన్నారు. డిపిఆర్ అంచాలతో 2, 3 ఫ్లెఓవర్ మంజూరుకు కేంద్రానికి పంపుతున్నామని, త్వరలో పనులు జరుగుతాయన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో టిడిపి నాయకులు విమర్శిస్తున్నారని మంత్రి అనీల్ కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా.. అందుకు సమాధానమిస్తూ గత ప్రభుత్వంలో 4 శాతం ఉన్న కాంట్రాక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా 26 శాతం వరకు ఆదా చేస్తున్నామని, ప్రతి రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తున్నా టిడిపి నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కర్తం ప్రతాప్ రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ప్రసాద్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, ప్రసన్నరెడ్డి, గిరిధర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రామాంజనేయరెడ్డి, గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, ఊటుకూరు నాగార్జున, సుబ్బారెడ్డి, శంకర్ రెడ్డి, షమీమ్, ఎస్ఆర్ఎస్ సతీష్, రఘు, నారాయణ, లక్ష్మి, ఇంద్రాణి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే నగర కార్పొరేషన్‌ను ప్రథమ స్థానంలో ఉంచుతాం Reviewed by CHANDRA BABU on December 15, 2019 Rating: 5 - రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 14వ బాలాజీనగర్, ఏసినగర్ ప్రాంతాల...

No comments: