పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం

- 6 మంది అరెస్ట్
కావలి, డిసెంబర్‌11, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు, గుట్కాలు, గంజా అక్రమ తరలింపు, విక్రయాలు, జూద గృహాల మీద ఉక్కుపాదం మోపాలని జిల్లా యస్పి బాస్కర్ బూషణ్ ఆదేశాల మేరకు కావలి డియస్పి ఉదయగిరి సి.ఐ వారి నేతృత్వంలో దుత్తలూర్ సబ్ ఇన్స్పెక్టర్ జంపాని కుమార్ వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు లక్ష్మిపురము నర్రవాడ మద్య గల అటవీ ప్రాంతములో ఆకస్మిక దాడి నిర్వహించి అక్కడ జూదం ఆడుతున్న గడ్డం పకీరయ్య, కాలం క్రిస్నారెడ్డి, రాగురి కొండారెడ్డి, పల్లాల ప్రసాద్, దుద్దుగుంట రఘురామిరెడ్డి, జలదంకి సురేష్ అను ఆరు మంది జూదరులను అదుపులోనికి తీసుకొని విచారించి వారివద్ద రూ.53,670 నగదు, 6 సెల్ ఫోన్లు, 04 మోటార్ బైక్లు, 2 సెట్ల పేక ముక్కలను స్వాధీన పరుచుకొని జూదరులను అరెస్ట్ చేయడమైనది. కావలి డియస్పి ప్రసాద్ కావలి సబ్ డివిజన్లో అసాంఘిక కార్యక్రమాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వీటిని నిరోదించే క్రమంలో కావలి సబ్ డివిజన్లో పనిచేసే అధికారులు అందరు కలిసి కట్టుగా పని చేయాలని తెలిపారు. జూదరులను అరెస్ట్ చేయుటలో కృషి చేసిన సబ్ ఇన్స్పెక్టర్ అయిన జంపాని కుమార్ వారి సిబ్బందిలను కావలి డియస్పి అభినందించారు.
పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం Reviewed by CHANDRA BABU on December 11, 2019 Rating: 5 - 6 మంది అరెస్ట్ కావలి, డిసెంబర్‌11, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు, గుట్కాలు, గంజా అక్రమ తరలింపు, విక్రయాలు, జూద గృ...

No comments: