పౌరసత్వ సవరణ బిల్లు పై పెల్లుబిక్కిన ఆగ్రహం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పౌరసత్వ సవరణ బిల్లు పై పెల్లుబిక్కిన ఆగ్రహం

నెల్లూరులో 3000 మందితో శాంతియుత నిరసన ర్యాలీ

మహాత్మ గాంధీకి వినతిపత్రం

ర్యాలీలో పాల్గొన్న ఏపీఎండబ్ల్యూఓ నాయకులు

గూడూరు, డిసెంబర్‌ 13, (రవికిరణాలు) : పౌరసత్వ సవరణ బిల్లుపై మైనారిటీల ఆగ్రహం పెల్లుబికింది. నెల్లూరులో ముస్లింల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3వేల మందితో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోటమిట్ట యూసుఫియా మశీదు నుండి ముస్లింలు ర్యాలీగా బయల్దేరి మద్రాసు బస్టాండు, వీఆర్సీ కళాశాల మీదుగా గాంధీబొమ్మకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, మగ్ధుమ్ మొహిద్దీన్ లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింల అణచివేతకు ధోరణిని అవలంభిస్తోందన్నారు. అందులో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశ పెట్టిందని దీంతో ముస్లింల కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.కుప్పకూలిన ఆర్ధిక వ్యవస్థ నుండి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి సీఏబి బిల్లును తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఈ సవరణ బిల్లును పునః పరిశీలించి దేశ సమైక్యత, సమగ్రతను కాపాడాలని కోరారు. అలాగే ఏపీఎండబ్ల్యూఓ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో 500మందితో సూళ్లూరుపేట లోని బస్టాండ్ వద్ద శాంతియుత ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ షేక్ జమాలుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ కాలేష, జిల్లా యువత అధ్యక్షుడు షేక్ హంషీద్ అలీ, జిల్లా కార్యదర్శి షేక్ అంజద్ అలీ, జిల్లా సంయుక్త కార్యదర్శి జాహిద్, నియోజకవర్గ అధ్యక్షులు యాసీన్, మౌలా అలీ, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ అల్లాబక్షు, సిటీ అధ్యక్షుడు ఫారుఖ్ సుబహాని, సర్వేపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాష, గూడూరు పట్టణ యువత అధ్యక్షుడు షేక్ గౌస్ బాష (బాబు), అర్షద్, సమీవుల్లా, ముజమ్మిల్, అక్మల్, హారూఫ్, బాబు, రియాజ్, నిసార్ అహ్మద్, సూళ్లూరుపేట నాయకులు అబ్దుల్ మాలిక్, ఖాజా, మాలిక్ బాష, బక్షు తదితరులు పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ బిల్లు పై పెల్లుబిక్కిన ఆగ్రహం Reviewed by CHANDRA BABU on December 13, 2019 Rating: 5 నెల్లూరులో 3000 మందితో శాంతియుత నిరసన ర్యాలీ మహాత్మ గాంధీకి వినతిపత్రం ర్యాలీలో పాల్గొన్న ఏపీఎండబ్ల్యూఓ నాయకులు గూడూరు, డిసెంబర్‌ 13, (రవికి...

No comments: