- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 05, (రవికిరణాలు) : నగరంలోని అన్నమయ్య కూడలి, కూరగాయల మార్కెట్టు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న భారీ హోర్డింగ్స్ తొలగించాలని యాడ్ ఏజన్సీ నిర్వాహకులను నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ఆదేశించారు. యాడ్ ఏజన్సీ నిర్వాహకులు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి నెల నుంచి యాడ్స్ కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించనున్నామని, అనధికార హోర్డింగ్స్ ఏర్పాట్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనధికార ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను క్రమబద్ధీకరణ చేసే ప్రక్రియకు వారం రోజుల గడువు ఏజన్సీలకు విధించామని, అనంతరం కార్పొరేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో తొలగింపు పనులు చేపడుతామని కమిషనర్ తెలిపారు. ప్రతీ హోర్డింగ్ వివరాలు కార్యాలయంలో అందుబాటులో ఉండేలా జియో ట్యాగింగ్ పధ్ధతిని అమలు చేయనున్నామని, యాడ్ ఏజన్సీ నిర్వాహకులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కమిషనర్ సూచించారు.

No comments: