- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఆశయాలను పౌరులంతా గుర్తుంచుకునేలా స్థానిక విఆర్సీ కూడలిలోని ఆయన విగ్రహ ఐలాండ్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 63 వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే ఆదర్శ భారత నిర్మాణం సాకారమవుతుందని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న ఐలాండ్ ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచి, పచ్చదనం పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

No comments: