ఎస్పీ ఐశ్వర్య రస్తోగి భరోసా - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎస్పీ ఐశ్వర్య రస్తోగి భరోసా

నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : జిల్లాలోని మహిళలందరూ అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా 100కి కాల్ చేస్తే తక్షణమే మీకు సహాయ,సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పి ఐశ్వర్య రస్తోగి తెలిపారు. సోమవారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిర్మూలించే దిశగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోందని అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మహిళలకు రక్షణభద్రత కల్పించే దిశగా షీ టీమ్‌లు, పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో వుంటారని 100 నెంబర్‌కి డయల్‌ చేసిన వెంటనే తమ పూర్తి సహాయ సహకారాలు వుంటాయని తెలియజేశారు.
ఎస్పీ ఐశ్వర్య రస్తోగి భరోసా Reviewed by CHANDRA BABU on December 02, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : జిల్లాలోని మహిళలందరూ అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా 100కి కాల్ చేస్తే తక్షణమే మీకు సహాయ,సహకారాలు...

No comments: