నెల్లూరు, డిసెంబర్07, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, యన్.జి.ఓ. కాలనీలో వార్డు సచివాలయాన్ని శనివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైయస్ఆర్సిపి నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు జిల్లా అధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇకమీదట ఈ పరిస్థితి ప్రజలకు ఉండబోదన్నారు. సమస్యలకు సత్వరమే ఈ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కారం దొరుతుందని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వై.యస్.జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 95% హామీలు నెరవేర్చారన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వాలంటీర్లు పనిచేయాలని అన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం
సమస్యలకు సత్వర పరిష్కారం
Reviewed by CHANDRA BABU
on
December 07, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్07, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, యన్.జి.ఓ. కాలనీలో వార్డు సచివాలయాన్ని శనివారం నెల్లూ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: