నెల్లూరు, డిసెంబర్ 16, (రవికిరణాలు) : యానాదులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చేసిన అనుచిత వ్యాఖ్యలను సోయం బాబురావు వెనక్కి తీసుకోవాలని ఏపి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సి.పెంచలయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిఎల్ శేఖర్, ఛైర్మన్ రాపూరు క్రిష్ణయ్యలు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి వున్న యానాదులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని లోకసభలో బిజెపి ఎంపి సోయంబాబురావు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు గిరిజనుల(ఎస్టీ)మధ్య చిచ్చు పెట్టేవిగా వున్నాయని ఇప్పుడు అన్ని విధాలుగా వెనుకబడియున్న యానాదుల అభివృద్ది కృషి చేయవలసిన ఎంపీ బాబురావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గిరిజనులందరు ముక్తఖంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల రవి, యల్లంపల్లి రమేష్, ఎస్.సరళా, వై.లక్ష్మీ, కత్తి మస్తానయ్య, బి.పద్మ, కె.చెంచు కృష్ణ, కె.బాబు, ఎన్.నాగబాబు, కోట్లపాటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల మధ్య చిచ్చుపెట్టొద్దు - కెసి పెంచలయ్య
December 16, 2019
Do not spill among the tribes - KC,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
గిరిజనుల మధ్య చిచ్చుపెట్టొద్దు - కెసి పెంచలయ్య
Reviewed by CHANDRA BABU
on
December 16, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 16, (రవికిరణాలు) : యానాదులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చేసిన అనుచిత వ్యాఖ్యలను సోయం బాబురావు వెనక్కి తీసుకోవాలని ఏ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: