అర్హులైన లబ్దిదారులకి వైఎస్సార్‌ నవశకంలో పింఛన్లు మంజూరు - శీనా నాయక్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అర్హులైన లబ్దిదారులకి వైఎస్సార్‌ నవశకంలో పింఛన్లు మంజూరు - శీనా నాయక్

నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : అర్హులైన లబ్దిదారులందరికి వై.ఎస్.ఆర్. నవశకంలో భాగంగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని డి.ఆర్.డి.ఎ. పి.డి. శీనా నాయక్ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం కలెక్టరు ఆదేశముల మేరకు డి.ఆర్.డి.ఎ. కార్యాలయంలో వై.ఎస్.ఆర్. నవశకం కార్యక్రమంలో భాగంగా నవశకానికి సంబంధించిన అధికారులతో వారు పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శీనా నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 3 లక్షల 45 వేల 922 పింఛన్లు వున్నాయన్నారు. గ్రామ సచివాలయ వాలంటీర్ల ద్వారా 92 శాతం సర్వే పూర్తి చేశామని, 8 శాతం మిగిలి వుందన్నారు. వీటిలో బ్రతుకు దెరువుకోసం బయటి ఊర్లకు వెళ్లిన వాళ్లు వున్నందున వారిని సర్వే చేయడం ఆలస్యం అవుతుందన్నారు. నవశకంలో భాగంగా వెనుకబడిన వారి ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారికి 0 శాతం వడ్డీ క్రింద తేది. 11-04-2019 నాటికి వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది తిరిగి చెల్లిస్తున్న వారికి వడ్డీని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. ఇందునిమిత్తం రూ. 53 కోట్ల 12 లక్షల వడ్డీని ఈ నెల 21వ తేదీలోపు వారి లోను అకౌంట్లకు జమచేయడం జరుగుతుందన్నారు. ఎం.ఆర్.ఓ., ఎం.పి.డి.ఓ. కార్యాలయాలలో డేటా ఎంట్రీ చేయబడుతుందన్నారు. అర్హులు కాని వారు ఆందోళన చెందనవసరం లేదని, సర్వే అయిన తరువాత వెరిఫికేషన్ జరుగుతుందని, గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబిత ప్రకటించినప్పుడు ఒక్క అర్హుడిని కూడా వదలకుండా కవర్ చేయబడుతుందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వివరాలు అడిగినప్పుడు వారి ఆథార్ నెంబరు గాని బ్యాంకు అకౌంటు నెంబరు గాని యివ్వరాదని, గుర్తింపు పొందిన గ్రామ వాలంటీర్లను గమనించి వివరాలు యివ్వవలసిందిగా కోరారు. అనంతరం సాంఘిక సంక్షేమశాఖ డి.డి. జీవ పుత్ర కుమార్ మాట్లాడుతూ నవశకం కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. విద్యా దీవెన, వై.ఎస్.ఆర్. వసతి దీవెన క్రింద 50,064 లబ్దిదారులను సర్వే చేయడం జరిగిందని, యింకా 19,259 మంది మిగిలి వున్నారన్నారు. ప్రిన్సిపాల్ లాగి లో ప్రిపాపులేటెడ్ డేటా వుందని, క్రొత్తగా దరఖాస్తు చేసుకొనే వారు మిస్సయితే సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా ఫారంలు తీసుకొని పూర్తి చేసి సర్వేలో విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరారు. అర్హులైన ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ లు అందించడానికి అధి కారులు కృషి చేస్తున్నారన్నారు. కలెక్టరు దిశా నిర్దేశంలో రానున్న రెండు రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. తదుపరి డి.ఇ.ఓ. జనార్ధనాచార్యులు మాట్లాడుతూ నవశకంలో భాగంగా వై.ఎస్.ఆర్. అమ్మఒడి పథకం క్రింద 42,934 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, 8వ తేదీలో పు వెరిఫికేషన్ పూర్తి చేసి 14వ తేదీలోపు అర్హుల జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు.అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారి బలాకృష్ణారావు మాట్లాడుతూ నవశకంలో భాగంగా బియ్యం కార్డుల క్రింద 9 లక్షల 13 వేల 921 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, 6 లక్షల 39 వేల 670 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయడం జరిగిందన్నారు. 70 శాతం డేటా ఎంట్రీ పూర్తి చేయబడి నెల్లూరుజిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో వుందన్నారు. రేషన్ కార్డును బియ్యం కార్డు పేరుతో నవశకం కార్యక్రమంలో యివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్డు బియ్యం చేయడానికి సర్వేయర్లను మండలాలకు పంపడం జరిగిందన్నారు. పేర్లు నమోదుకాని వారు ఆందోళన చెందనవసరం లేదని, బియ్యం కార్డులకు సంబంధించి అర్హులందరికి కార్డులు యివ్వడం జరుగుతుందని, సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రకటించి 5 రోజులలో కార్డులు యివ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు యిబ్బంది పడకుండా ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తదుపరి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి రాజేశ్వరి మాట్లాడుతూ బి.సి. కార్పొ రేషన్ ద్వారా వై.ఎస్.ఆర్. నవశకంలో భాగంగా వై.ఎస్.ఆర్. కాపునేస్తం, రజక నేస్తం క్రింద రూ. 10,000/-లు మంజూరు చేయబడుతుందని, అర్బన్ సర్వేలో 6,657 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, రేపటికల్లా సర్వే పూర్తవుతుందని, మరో 8 వేల మంది దాకా లబ్దిదారులు వుండవచ్చన్నారు. కులధృవీకరణ పత్రాలలో జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నామని, అర్హులైన వారందరికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా.నాగార్జున మాట్లాడుతూ నవశకం కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కార్డుల క్రింద 5 లక్షల 25 వేల 336 మందిని సర్వే చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య శ్రీకార్డు, రేషన్ కార్డు కలిగి వుండి, ఆరోగ్యశ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సర్వే చేయడం జరుగుతుందన్నారు. అర్హత వుండి కూడా రేషన్ కార్డు లేని వారికి కొత్త దరఖాస్తు ఫారాలు యివ్వబడతాయన్నారు. గ్రామ వాలంటీర్లతోపాటు ఆషా వర్కర్లు ఇంటి వద్దకు వస్తారని, గుర్తింపు వున్న వారికి మాత్రమే వివరాలు అందజేయాలన్నారు. ఇప్పటి వరకు వున్న హెల్త్ కార్డులు పనిచేస్తాయని, రేషన్ కార్డు ఆధారంగా యిచ్చిన అన్ని కార్డులు పనిచేస్తాయని, జనవరి 1 నుండి కొత్త కార్డులు అమల్లోకి వస్తాయన్నారు.
అర్హులైన లబ్దిదారులకి వైఎస్సార్‌ నవశకంలో పింఛన్లు మంజూరు - శీనా నాయక్ Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : అర్హులైన లబ్దిదారులందరికి వై.ఎస్.ఆర్. నవశకంలో భాగంగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని డి.ఆర్.డి.ఎ. ...

No comments: