శారిరకారోగ్యంలో దంతాల సంరక్షణ ప్రధమం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శారిరకారోగ్యంలో దంతాల సంరక్షణ ప్రధమం

- కమిషనర్ పివివిస్ మూర్తి

నెల్లూరు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): శరీరానికి శక్తిని అందించే జీర్ణక్రియ ప్రక్రియలో దంతాల పాత్ర అత్యంత కీలకమని, వాటి సంరక్షణకు ప్రధమ ప్రాధాన్యత కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి అభిప్రాయపడ్డారు. స్మైల్ డెంటల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన కమిషనర్ కు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య ఫలితాలను విశ్లేషించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అందరూ వైద్య పరీక్షలు, సేవలు పొందాలని సూచించారు. దంత సమస్యలతో పాటు ప్రాధమిక ఆరోగ్య పరీక్షల ఫలితాలతో శరీర ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, అవసరమైన వైద్య సేవలు పొందాలని సిబ్బందిని కమిషనర్ కోరారు. ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
శారిరకారోగ్యంలో దంతాల సంరక్షణ ప్రధమం Reviewed by CHANDRA BABU on December 18, 2019 Rating: 5 - కమిషనర్ పివివిస్ మూర్తి నెల్లూరు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): శరీరానికి శక్తిని అందించే జీర్ణక్రియ ప్రక్రియలో దంతాల పాత్ర అత్యంత కీలకమని,...

No comments: