గ్రామ,వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణ ప్రారంభం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

గ్రామ,వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణ ప్రారంభం

శిక్షణ తరువాత సమాజానికి కన్నులు - చెవులుగా వ్యవహరించేది మీరే - జిల్లా యస్పి
రాబోయే రోజులలో గ్రామ స్వరాజ్యం మీ ద్వారానే వికసించాలి - జిల్లా కలెక్టర్
7 బ్యాచ్ లుగా 924 మంది అభ్యర్ధినులుగా విభజన, మొదటి బ్యాచ్ లోని 132
నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు గ్రామ/వారు మహిళా సంరక్షణ కార్యదర్శుల 2 వారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు, జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ డిటిసి వైస్ ప్రిన్సిపాల్ అడిషనల్ యస్పి(క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు మునిసిపల్ కమీషనర్ పి.వి.వి.యస్. మూర్తి, ఏపిడి, ఐసిడిఎస్‌ ఎ.శేషకుమారి పోలీసు అధికారుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు పరిధులు లేకుండా అందరి దృష్టికి వచ్చేవి మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే నేరాలు అని వాటిని అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో సమాజంలో కలిసి పనిచేసే అధికారి ఒకరు ఉండాలని, వారి ద్వారానే పలు రకాల వేధింపులు, సమస్యలకు స్వాంతన చేకూరేలాగా సంక్షేమ పథకాల లక్ష్యాలు అందరికీ చేరి, గ్రామ స్వరాజ్యం వికసించేలా గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు నియమించడం జరిగిందని తెలిపారు. శిక్షణ విజయవంతంగా పూర్తి అనంతరం గురుతర బాధ్యతతో సమాజంలోని నేరాలు, మాదక ద్రవ్యాలు, మద్యం అక్రమ నిల్వల నియంత్రణలో మెరుగైన సేవలందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి మాట్లాడుతూ శిక్షణతరువాత కార్యదర్శులందరూ సమాజానికి కన్నులు-చెవులుగా వ్యవహరించాల్సి ఉంటుందని, శిక్షణను అందరూ ఏకాగ్రతతో విజయవంతంగా ముగించాలని తెలిపారు. సాధారణంగా 2 సంవత్సరాల పాటు జరిగే పోలీసు శిక్షణ కార్యక్రమాన్ని, అన్నీ ప్రధాన అంశాలను కేవలం 2 వారాలకు కుదించి సిలబస్ రూపొందించడం జరిగిందని, శిక్షణలో భాగంగా శాంతి భద్రతలు మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే గృహహింస, లైంగిక వేదింపులు, దాడులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి వారికి రక్షణ భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు అందరూ సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వైస్ పిన్సిపాల్ అడిషనల్ యస్పి(క్రైమ్స్) మాట్లాడుతూ మొత్తం 924 మంది అభ్యర్ధినులను ప్రతి బ్యాచ్ కి 132 మంది చొప్పున 7 బ్యాచ్ లుగా విభజించడం జరిగిందని, జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం లోనే అన్నీ వసతులతో పాటు చంటి పిల్లల తల్లులకు, గర్బిణీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. నెల్లూరు మునిసిపల్ కమీషనర్ మాట్లాడుతూ కార్యదర్శులు అందరూ పూర్తి స్థాయిలో నిమగ్నమై శిక్షణ పూర్తి చేసుకుని రాబోయే 3 నుండి 6 నెలలలో గ్రామ/వార్డు స్థాయిలో ప్రజలతో మమేకమై క్రైమ్ రేటు తగ్గించాలని తెలిపారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసిడిఎస్‌ మాట్లాడుతూ 'సఖి' కేంద్రాల సేవలపై అన్ని రకాల హెల్ప్ లైన్ సదుపాయాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డిటిసి డియస్పి రవీంద్ర రెడ్డి కో ఆర్డినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పి(ఎ.ఆర్.) యస్.వీరభద్రుడు, యస్.బి. డియస్పి యన్ కోటా రెడ్డి, నెల్లూరు రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, డియస్పి(ఎ.ఆర్) రవీంద్ర రెడ్డి, టౌన్, రూరల్, యస్.బి. ఇన్స్పెక్టర్ లు, రిజర్వు ఇన్స్పెక్టర్ లు, జిల్లా చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బి.సురేష్ శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ,వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణ ప్రారంభం Reviewed by CHANDRA BABU on December 09, 2019 Rating: 5 శిక్షణ తరువాత సమాజానికి కన్నులు - చెవులుగా వ్యవహరించేది మీరే - జిల్లా యస్పి రాబోయే రోజులలో గ్రామ స్వరాజ్యం మీ ద్వారానే వికసించాలి - జిల్లా క...

No comments: