- విద్యార్థులను అభినందించిన కమిషనర్
నెల్లూరు, డిసెంబర్ 16, (రవికిరణాలు) : గుంటూరులో ఈ నెల్ 13వ తేదీ నుంచి 15 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడోత్సవాల్లో నెల్లూరు కార్పొరేషన్ విద్యార్థులు ఖోఖో క్రీడలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని నగర పాలక సంస్థ కార్యాలయంలో కోచ్ ల ఆధ్వర్యంలో విద్యార్థులు కమిషనర్ పివివిస్ మూర్తిని కలుసుకుని రాష్ట్ర పోటీల్లో సాధించిన కప్పును ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులను అభినందించి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ శారీరకంగా ధృడంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో, విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ నెల్లూరు కార్పొరేషన్ ఖ్యాతిని పెంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కమిషనర్ అభినందించిన వారిలో వెంగళరావు నగర్ తాతయ్య బడి విద్యార్థులు ఫరియా, అనూష, ధనలక్ష్మి, ప్రియాంక, రిజ్వాన, పవిత్ర, అహ్మదున్నిసా, ఆర్.ఎస్.ఆర్ పాఠశాల నుంచి వాసంతి, కె.ఎన్. ఆర్ పాఠశాల నుంచి రమ్య, వెంకటేశ్వరపురం పాఠశాల నుంచి దీప్తి శైలజ, బి.వి.ఎస్ పాఠశాల నుంచి మధులత, దేవి, కోచ్, వెంగళరావు నగర్ పి.ఈ.టి అజయ్ కుమార్ పాల్గొన్నారు.

No comments: