పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లు పంపిణీ చేస్తాం
గూడూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) : గూడూరులోని అరుంధతీయ పాలెం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వెంకట కృష్ణ ప్రారంభించారు.కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఎం.వి.రావ్ పౌండేషన్, శంకర్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో విద్యార్థులకు విషజ్వరాల పట్ల అవగాహన కల్పించారు. జ్వరాలు రాకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీటిని తాగాలి అని కోరారు. జ్వరం రక్త కణాలు తగ్గిపోకుండా బొప్పాయి ఆకు రసం తీసుకుంటే జ్వరాలు సోకినా రక్త కణాలు తగ్గిపోవడం జరగదని ఎమ్.వి.రావ్ పౌండేషన్ ఛైర్మన్ ముప్పవరపు లీలామోహన కృష్ణ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో విద్య విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వహణకు గాను భోజన ప్లేట్స్ ఇవ్వాలని కోరగా జనవరిలో పాఠశాలకు అందజేస్తామని లీలా మోహన్ కృష్ణ హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు మూడు రోజులకు సరిపడా హోమియో మందులను సంస్థ నిర్వాహకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల కోటమ్మ, షఫీ, వసుధ, సుప్రియ, స్థానిక అరుంధతీయ వాడ ప్రజలు గ్రామస్తులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

No comments: