అల్లీపురం, గుడిపల్లిపాడు రూపురేఖలను మారుస్తామన్న గిరిధర్‌రెడ్డి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అల్లీపురం, గుడిపల్లిపాడు రూపురేఖలను మారుస్తామన్న గిరిధర్‌రెడ్డి

నెల్లూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ అల్లీపురం గుడిపల్లిపాడు రూపురేఖలను త్వరలోనే మారుస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ అల్లీపురం, బలరామపురంలో సి.సి. డ్రైన్, స్మశానమునకు గ్రావెల్ రోడ్డు, పైప్ లైన్ పనులకు గిరిధర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.చెప్పిన మాట ప్రకారం మా సోదరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాలుగు కోట్ల నలబై లక్షల రూపాయలతో అల్లీపురం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో నడచిన ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తిపు, గౌరవం ఇస్తామని గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు వరకే రాజకీయాలు చేస్తాం. ఎన్నికలు అయిన తరువాత కులం, మతం, ప్రాంతం చూడకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుకు కృషి చేస్తామన్నారు.
అల్లీపురం, గుడిపల్లిపాడు రూపురేఖలను మారుస్తామన్న గిరిధర్‌రెడ్డి Reviewed by CHANDRA BABU on December 10, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ అల్లీపురం గుడిపల్లిపాడు రూపురేఖలను త్వరలోనే మారుస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్య...

No comments: