తాడేపల్లి, డిసెంబర్07, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైఎస్సార్ సీపీ భగవద్గీత, బైబుల్, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. కాగా బీద మస్తాన్‌రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్‌రావు ఆ పార్టీని వీడారు.
వైఎస్సార్ సీపీలో చేరిన బీద మస్తాన్‌రావు
వైఎస్సార్ సీపీలో చేరిన బీద మస్తాన్‌రావు
Reviewed by CHANDRA BABU
on
December 07, 2019
Rating: 5
తాడేపల్లి, డిసెంబర్07, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: