గ్రామీణ ఆదాయవృద్ధికి కేంద్ర పథకాలతో ఊతం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

గ్రామీణ ఆదాయవృద్ధికి కేంద్ర పథకాలతో ఊతం

ఎంపీ ఆదాలకు తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మందగమనంతో పాటు దేశంలోనూ కొంత నిరాశాజనకంగా మారిన ఆర్థిక వృద్ధికి చేయూత ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలుకు కృషి చేస్తోందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు. దేశీయ ఆర్థిక వృద్ధి మందగమనాన్ని అధిగ మించెందుకు గ్రామీణ ప్రాంతాల్లో, అసంఘటిత రంగాల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం లోక్సభలో ప్రశ్నించారు. దానికి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా కనిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, భారతదేశంలో ఆర్థిక వృద్ధి వేగంగానే సాగుతోందని జవాబిచ్చారు. దేశంలో అసంఘటిత రంగాల్లో ఆర్థిక వృద్ధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి, ముద్ర యోజన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, దీనదయాళ్ అంత్యొదయ యోజన, రొజ్గార్ ప్రోత్సాహక యోజన, ఉపాధి కల్పన పథకం, ఉపాధి హామీ పథకం వీటితోపాటు హౌసింగ్ ఫర్ ఆల్ తదితర పథకాలు ఎన్నింటినో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ పథకాల సక్రమ అమలు ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ఆదాయవృద్ధికి కేంద్ర పథకాలతో ఊతం Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 ఎంపీ ఆదాలకు తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మందగమనంతో పాటు...

No comments: