నగరంలో వామపక్షాల నిరసన ర్యాలీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నగరంలో వామపక్షాల నిరసన ర్యాలీ

నెల్లూరు, డిసెంబర్‌11, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అధిక ధరల మీద సుందరయ్య బొమ్మ దగ్గర నుండి గాంధీ బొమ్మ దాకా నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు మూలం రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే ఉల్లిపాయ ధర మార్కెట్లో కొనలేని పరిస్థితి రైతు బజారు కెళ్ళి కొనాలన్నా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల దాకా క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి అని దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా ఆర్టీసీ చార్జీలు పెంచడం పేదవాడికి ఇబ్బంది అని ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం ధరలను నియంత్రించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ సిపిఎం నాయకులు మూలం ప్రసాద్ మునీర్ తదితరులు పాల్గొన్నారు
నగరంలో వామపక్షాల నిరసన ర్యాలీ Reviewed by CHANDRA BABU on December 11, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌11, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అధిక ధరల మీద సుం...

No comments: