"దిశా" సంఘటన పై నిరసన ర్యాలీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

"దిశా" సంఘటన పై నిరసన ర్యాలీ

నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా డ్యాన్స్‌ మాస్టార్స్‌ అసోసియేషన్‌, నెల్లూరు నగర షీ టీమ్‌ పోలీసుల ఆద్వర్యంలో "దిశా" సంఘటన పై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, రాబోయే రోజుల్లో మహిళలు చైతన్య వంతులై పోలీసుల హెల్స్‌ లైన్‌ల నెంబర్లు 100, 112,181, వాట్సప్‌ 9390777727, సైబర్ మిత్ర 9121211100లు తమ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయాలలో ఈ నెంబర్లను వినియోగించి ఆపద నుండి బయట పడాలని కోరారు. ఈ సందర్భంగా షీ టీమ్‌ పోలీసులు మాట్లాడుతూ తాము 24గంటలు మహిళల రక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డ దళంగా పేర్కొంటూ మా సేవలను మహిళలు ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దొర్నాల హరిబాబు, అమీర్‌జాన్‌, డ్యాన్స్‌ మాస్టార్స్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎన్‌.వి రాజు, కృష్ణవేణి, ఆరెస్ట్రా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సప్తస్వర రాజా, తదితరులు పాల్గొన్నారు.
"దిశా" సంఘటన పై నిరసన ర్యాలీ Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, నెల్లూరు జిల...

No comments: