నెల్లూరు, డిసెంబర్ 16, (రవికిరణాలు) : ఇన్సాఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో(సిఏబి-ఎన్‌ఆర్‌సి)బిల్లుకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె.అజీజ్ అహ్మద్ మాట్లాడుతూ మనదేశంలో బిజెపి రెండొసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశ అభివృద్ది పక్కనపెట్టి త్రిపుల్, తలాఖ్ బిల్లు అది కాశ్మీర్‌లోని ముస్లీంలను హింసకు గురిచేసి 370ఆర్టికల్ రద్దు చేసి అదేవిధంగా అయోధ్యలోని బాబ్రిమసీదు అంశాన్నితీసుకోచ్చి ముస్లీంలపై అణిచివేసే పనులను ముందుకు తీసుకువెళ్తున్నారు ఇదేతరుణంలో అదే పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం (మత విభజనకు బిజెపికుట్ర- ముస్లీములే టార్గెట్)అందుకే పౌరసత్వమంటలు రాజేస్తున్న మతతత్వ బిజెపి కేంద్రప్రభుత్వవిధానాలకు ముస్లీంలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకించారు. మన రాష్ట్రంలో ఉన్న సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ముస్లీంలబిల్లుతో గెలిచిన బిజెపికి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల సమయం ప్రతివార్డులో ఈ మద్దతు పలికిన ముస్లీంలకు, మద్దతు ఇచ్చిన ప్రజలకు సమాధానం అవ్వలేకుంటే చేసిన తప్పుకు ఇప్పటికైనా ఆ బిల్లుకు వ్యతిరేకించాలి లేకుంటే తగిన మూల్యం తప్పదని ఈ బిల్లును రద్దుచేసే వరకు పోరాటం చేస్తూనే వుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్డీ సిరాజ్,
ముస్లీం ఐక్యవేధిక నాయకులు ముఫ్తి, ఇలియాజ్‌సాబ్, నూర్‌సాహెబ్, ఖాధీర్, ఎస్.కె.షబ్బీర్, హిదాయతుల్లా, ఎస్.కె.లతీఫ్, ఎస్.కె.మున్వర్, మైనుద్దీన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
ముస్లీం ఐక్యవేధిక నాయకులు ముఫ్తి, ఇలియాజ్‌సాబ్, నూర్‌సాహెబ్, ఖాధీర్, ఎస్.కె.షబ్బీర్, హిదాయతుల్లా, ఎస్.కె.లతీఫ్, ఎస్.కె.మున్వర్, మైనుద్దీన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
No comments: