నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి

- ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రతి మండలంలోను ఏర్పాటు చేయాలి- చేజర్ల

కోవూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : రోజు,రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వలన మధ్య తరగతి ప్రజల ఆర్ధిక పరిస్థితులు తలకిందులు అయినాయని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఉల్లి విక్రయ కేంద్రాలు అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కోవూరు తహసీల్దార్ కార్యాలయములో స్పందన కార్యాక్రమములో తహసీల్దార్ కు అర్జీ ఇవ్వడము జరిగినది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని,గతములో ఉల్లి కొస్తే కంట్లో నీళ్లు వచ్చేవని,నేడు ఉల్లి కొంటే కన్నీరు వస్తున్నాయని,రోజు,రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడములో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుండి సరుకులు దిగుమతి చేసుకోని ధరలును అదుపులోకి తెచ్చేదాని,కానీ ,నేటి ప్రభుత్వము అటువంటి చర్యలు ఏమి తీసుకోవడము లేదని,పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వలన పేద కుటుంబాలపై నెలకు 2వేల నుండి 3 వేల వరకు అదనపు భారం పడుతుందని దీనివలన పేదల కుటుంబ బడ్జెట్ తలక్రిందులు అవుతుందని కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధరలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధముగా ప్రతి మండల కేంద్రంలో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి సబ్సిడీ పై ఉల్లిపాయలు సరఫరా చేయాలని,గతములో ఆహార సలహా సంఘాలుగా ఉండి విజిలెన్స్ కమిటీలగా మార్చబడిన విజిలెన్స్ కమిటీల జిల్లా స్థాయి,మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి గల కారణాలను చర్శించాలని,గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లాగే తెల్ల రెషన్ కార్డులు పై రెండు కేజీల కండిపప్పును ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి Reviewed by CHANDRA BABU on December 09, 2019 Rating: 5 - ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రతి మండలంలోను ఏర్పాటు చేయాలి- చేజర్ల కోవూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : రోజు,రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్...

No comments: