- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 12, (రవికిరణాలు) :పారిశుధ్య పర్యవేక్షణలో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు హెచ్చరిక నోటీసులు పంపనున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. స్థానిక మాగుంట లే అవుట్ పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య నిరుపయోగంగా ఉన్న ప్లాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో వర్షాలకు భారీ స్థాయిలో నీటి నిల్వలు చేరి ప్రాణాంతక దోమలు పెరిగేందుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాల్లో పరిశుభ్రతా పర్యవేక్షణల బాధ్యత పూర్తిగా యాజమాన్యానిదేనని, నోటీసులు అందుకున్నవారు వెంటనే మురుగునీటిని తొలగించి ప్లాట్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ హెచ్చరికలను యజమానులు బేఖాతరు చేస్తే, స్థానికులకు ఇబ్బంది కలిగించేలా ఉన్న ఆయా స్థలాలను జప్తు చేసుకుని కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపడుతామని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

No comments: