పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుందాం : జి.నాగేశ్వరరావు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుందాం : జి.నాగేశ్వరరావు

నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్మికులందరూ ఏకం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పతాకావిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చి కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ప్రపంచ కార్మికులందరూ పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి కార్మికుల శ్రమను దోచుకునేందుకు 9 గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తోందన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నెల్లూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15వ మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ముందుగా పప్పుల వీధిలోని చింతపండు హమాలీ వర్కర్స్ యూనియన్ జెండాను జి నాగేశ్వరరావు, ట్రాలీ ఆటో వర్కర్స్ యూనియన్ జెండాను సిఐటియు నగర అధ్యక్షుడు ఏ శ్రీనివాసులు, పప్పుల వీధి హమాలీ వర్కర్స్ యూనియన్ జెండాను సిఐటియు ఆఫీస్ బేరర్ జి జయరాములు, సంతపేట హమాలీ వర్కర్స్ యూనియన్ జెండాను ఎన్ సతీష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు మాబాష, అన్నం పెంచలయ్య, ఏ నాగయ్య, బి రాంబాబు, కె సుధాకర్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుందాం : జి.నాగేశ్వరరావు Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట...

No comments: