నెల్లూరు, డిసెంబర్ 17, (రవికిరణాలు) : స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టరు డా. వి.వినోద్ కుమార్ అన్నారు.మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి స్పందన అర్జీల పరిష్కార చర్యల గురించిజిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించబడిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. కార్యాలయం నుండి పంపబడిన 89 పిటీషన్ల పై సంబంధిత అధికారులు చేపట్టబడిన చర్యల గురించి సమీక్షించారు. వీటిలో 12 మాత్రమే పరిష్కరించడినందున మిగతా అర్జీల పరిష్కారానికి తగు చర్యలుతీసుకొనవలసిందిగా కోరారు. ప్రతినెల 17వ తేదీన స్పందన అర్జీల పరిష్కారం గురించి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో కావలి, గూడూరు, సబ్ కలెక్టర్లు చామకుర్తి శ్రీధర్, ఆర్.గోపాలకృష్ణ, నెల్లూరు, ఆత్మకూరు, నాయుడు పేట ఆర్.డి.ఓ.లు, హుస్సేన్ సా హెబ్, ఉమాదేవి, సరోజి, ఎం.ఆర్.ఓ.లు తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి - జాయింట్ కలెక్టర్
December 17, 2019
Solve the problems of the people fast - Joint Collector,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి - జాయింట్ కలెక్టర్
Reviewed by CHANDRA BABU
on
December 17, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 17, (రవికిరణాలు) : స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టరు డా. వి.విన...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: