సమస్యలకు సత్వర పరిష్కారం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సమస్యలకు సత్వర పరిష్కారం

నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్, త్యాగరాజ నగర్, 2వ వీధిలో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయడైరీ కొండ్రెడ్డి రంగా రెడ్డి మునిసిపల్ కమీషనర్ వార్డు సచివాలయాలను(3)ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇకమీదట ఈ పరిస్థితి ప్రజలకు ఉండబోదన్నారు. సమస్యలకు సత్వరమే ఈ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కారం దొరుతుందని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 95% హామీలు నెరవేర్చారన్నారు. ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వాలంటీర్లు పనిచేయాలని అన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్, త్యాగరాజ నగర్, 2వ వీధిలో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల...

No comments: