విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు - జిల్లా కలెక్టరు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు - జిల్లా కలెక్టరు

నెల్లూరు, డిసెంబర్‌ 03, (రవికిరణాలు) : రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం పలు పథకాలు చేపట్టిందని జిల్లా కలెక్టరు ఎం.వి.శేషగిరిబాబు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎ.పి. ఎన్.జి.ఓ. హోమ్ నందు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టరు ఎం.వి.శేషగిరిబాబు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించడం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఈనెలలో తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లా స్థాయిలో సమస్యలు తీర్చడం కోసం వివిధ శాఖల అధికారులతో ఈనెల 21వ తేదీన దివ్యాంగుల సమస్యల గురించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వివిధ సంఘాల ప్రతినిధులను పిలుస్తామన్నారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల గురించి చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల మీద ప్రత్యేక శ్రద్ధతో సదరం సర్టిఫికేట్లు ప్రభుత్వ ఆసుపత్రి నుండే కాక ఏరియా ఆసుపత్రుల ద్వారా కూడా జారీ చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు డివిజన్ లలోని ఏరియా ఆసుపత్రులలో కూడా సదరం సర్టిఫికేట్లు జారీ చేయడానికి చర్యలు చేపడతామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన అన్ని సమస్యలు తీర్చడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారన్నారు. రానున్న రోజులలో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టరు హామీ యిచ్చారు. అనంతరం ఆటపాటలలో గెలుపొందిన వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు, ట్రై సైకిళ్లు అందజేశారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు - జిల్లా కలెక్టరు Reviewed by CHANDRA BABU on December 03, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 03, (రవికిరణాలు) : రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం పలు పథకాలు చేపట్టిందని జిల్లా కలెక్టరు ఎం.వి.శే...

No comments: